అడివి శేష్ హీరోగా 26/11 ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై తీస్తున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే ఈ మూవీ ట్రైలర్‌ను మహేష్ బాబు అధికారికంగా లాంచ్ చేయనుండగా.. హిందీ ట్రైలర్‌ను సల్మాన్, మలయాళం ట్రైలర్‌ను పృథ్వీరాజ్ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ట్రైలర్ లాంచ్ చేయనున్నారు.