ఆ్రస్టేలియా జట్టుతో ఈనెల 17న మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా వన్డేలకు శ్రేయస్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెల్లడించింది. అతడి స్థానంలో త్వరలోనే మరొకరిని భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. అటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌కు అయ్యర్ సారథ్యం వహిస్తుండగా ప్రారంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. నాల్గో టెస్టులో అయ్యర్‌కు వెన్ను నొప్పి తిరగబెట్టడంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.