అమెరికాలో సినీ తారలతో వ్యభిచారం కేసులో నిర్మాత కిషన్, అతడి సతీమణి చంద్రకళ దోషులుగా తేలారు. వీరికి అక్కడి స్థానిక కోర్టు జూన్ 24న శిక్ష ఖరారు చేయనుంది. వీరికి 27 నుంచి 34 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. 2018 నుంచి వీరు ఇలా చేస్తూ వస్తున్నారు. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికాకు రప్పించి.. వ్యభిచారం చేయించేవారని కోర్టు తేల్చింది. ఈ కేసులో ఇద్దరు కన్నడ హీరోయిన్లకు కూడా సంబంధం ఉందనే వార్తలు వస్తున్నాయి.