ఉక్రెయిన్ పై దాడులకు నిరసనగా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాలను కూడా తెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆహార, పానీయాల ప్రాంచైజీలపై సోషల్ మీడియాలో ఒత్తిడి పెరిగింది. ‘BoycottMcDonalds’, ‘BoycottCocaCola’ హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. దీంతో దిగొచ్చిన కంపెనీలు రష్యాలో తమ వ్యాపారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే కోకా కోలా, పెప్సికోలు తమ కార్యకలాపాలను ఆపేయగా తాజాగా ఆ జాబితాలో మెక్ డొనాల్డ్స్, స్టార్ బక్స్ చేరాయి.