ఎంసెట్-2022 నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తులు మొదలుపెట్టింది. ఈనెల 7న నిర్వహించనున్న చర్చల్లో ఎంసెట్ పరీక్షలపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలిలో ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల తేదీలు ప్రకటించింది. దీంతో పాటు ఇంటర్మీడియేట్ పరీక్షలు కూడా మే నెలలో జరగనున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జూన్ మొదటి వారంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈసారి ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది.