దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరారు. గురువారం భారత్ చేరుకున్న ఆయన SRH టీంకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఇతడికి ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు 95 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అనుభవం కూడ ఉంది. సన్‌రైజర్స్ జట్టుకు టామ్ మూడీ హెడ్ కోచ్‌గా, లారా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి స్టెయిన్ తన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈనెల 29న హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.