నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశముందున్న అంచనాలతో ప్రతికూలత ఏర్పడింది. ఇక అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఐటీ, కన్జూమర్ షేర్లు నష్టపోవడంతో సూచీలు నేడు తీవ్ర నష్టాలను చవిచూశాయి. చివరికి సెన్సెక్స్ 568 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద, నిఫ్టీ 153 పాయింట్ల నష్టంతో 16,416 వద్ద స్థిరపడ్డాయి.