కుప్ప‌కూలిన మార్కెట్లు.. మ‌దుప‌ర్ల‌కు భారీ న‌ష్టం

© File Photo

నేడు స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలాయి. మదుప‌ర్ల‌కు ఈరోజు బ్లాక్ ఫ్రైడేగా మారింది. అమెరికా ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతుంద‌నే భ‌యాలు, అంత‌ర్జాతీయ మార్కెట్ల బ‌లహీన‌త‌ల నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ల‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. ప్రారంభం నుంచే న‌ష్టాల్లోకి జ‌రుకున్న మార్కెట్లు చివ‌రివ‌ర‌కు అదేవిధంగా కొన‌సాగాయి. చివ‌రికి సెన్సెక్స్ 1016 పాయింట్ల న‌ష్టంతో 54,303 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 276 పాయింట్ల న‌ష్టంతో 16,201 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నేడు వెలువ‌డ‌నున్న అమెరికా ద్ర‌వ్యోల్బ‌ణ గ‌ణాంకాలు, రూపాయి విలువ క్షీణించ‌డం, క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం వంటివి మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణాలుగా విశ్లేష‌కులు చెప్తున్నారు.

Exit mobile version