స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో 53,541 వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 16,052 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. రష్యాపై అమెరికా కొన్ని ముడిచమురు, గ్యాస్ దిగుమతులపై ఆంక్షలు విధించింది. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలకు ఐరోపా దేశాలు మద్ధతు తెలిపాయి. దీంతో స్టాక్ మార్కెట్లకు కొంత ఊరట లభించింది. మరోవైపు గత కొన్నిరోజులుగా మార్కెట్లు నష్టపోతుండటంతో తక్కువ ధరలో స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గుచూపుతుండటం కూడా మార్కట్ల లాభాలకు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం సెన్సెక్స్ 514 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 134 పాయింట్లు పైకి చేరింది.