దేశీయ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి బుల్ వేగంగా పుంజుకోవడంతో సెషన్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడి 57,593.49 వద్ద ముగియగా, నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 17222 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభపడగా.. యూపీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ముగిశాయి.