దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. S&P BSE సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా తగ్గి 54,000 స్థాయికి చేరింది. NSE నిఫ్టీ 110 పాయింట్లకుపైగా తగ్గి 16,000 పాయింట్ల ఎగువన కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్ టాప్-5 లాభాల స్టాక్స్ లో ఉన్నాయి.