దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17755 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడి 60348 పాయంట్ల వద్ద స్థిరపడింది. ఐటీసీ, మారుతి, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, టాటా స్టీల్ సంస్థల షేర్లు లాభాల్లో ముగిశాయి. టైటాన్, కొటక్ మహీంద్రా, విప్రో,నెస్లే ఇండియా, టాటా మోటార్స్ సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగాయి.