కేరళ బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్ లేదా మేడమ్ అని పిలవొద్దని పేర్కొంది. టీచర్ అని మాత్రమే సంబోధించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని సాధారణ విద్యాశాఖను ఆదేశించింది. “ టీచర్ అనే పదం పురుషులకు, మహిళలకు ఇద్దరికీ వర్తిస్తుంది. విద్యార్థి దశలోనే వారిద్దరూ సమానమే అని చెప్పేందుకు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాం” బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.