తెలంగాణ ఆయువు పట్టైన సింగరేణిని ప్రవేటుపరం చేసే కుట్రలు మానుకోవాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణలో ప్రగతిని చూసి ఓర్వలేక భాజపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గుగనులు వేలం వేస్తున్నట్లు కేంద్రం మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్‌లో ప్రకటించడం పట్ల KTR ధ్వజమెత్తారు. గుజరాత్‌లో లిగ్నైట్ గనులను ప్రభుత్వ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పజెప్పినట్లే, తెలంగాణలో సింగరేణిని ప్రభుత్వానికి అప్పగించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.