రాజస్థాన్‌లోని దౌసాలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యురాలు అర్చన శర్మ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిదే. ఆసుపత్రిలో గర్భిణీ మరణించినందుకు ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మరణించిన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె “అమాయక వైద్యులను వేధించవద్దని” అభ్యర్థించింది. ‘‘నాకు నా భర్త, పిల్లలంటే చాలా ఇష్టం.. నా మరణానంతరం వారిని వేధించకండి.. నేనేం తప్పు చేయలేదు.. ఎవరినీ చంపలేదు.. డాక్టర్లను ఇంతగా వేధించడం మానేయండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.