సమంత యశోద సినిమాను ఓటీటీలో ప్రదర్శించకూడదంటూ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ సినిమాలో ఈవా హాస్పిటల్స్ పేరు దెబ్బతినేలా చూపించారని ఆస్పత్రి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన కోర్టు డిసెంబరు 19వరకు స్ట్రీమింగ్ చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 19కి వాయిదా వేసింది. సరోగసి, మెడికల్ మాఫియా ప్రధాన కథాంశంగా తెరకెక్కిన సినిమా ఇది. సమంత కీలక పాత్ర పోషించి అలరించింది. హరి-హరీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోర్టు ఆదేశాలపై చిత్ర యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
యశోద ఓటీటీ విడుదల ఆపండి: కోర్టు
