అంత్యక్రియల వేళ మహిళలకు పాటించే వితంతు ఆచారాలు రూపుమాపాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని 28వేల గ్రామ పంచాయతీలకు సర్క్యులర్ జారీ చేసింది. వితంతు ఆచారాలపై నిషేధం విధిస్తూ తీర్మానం చేసుకున్న కొల్లాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఈ కాలంచెల్లిన ఆచారాలపై నిషేధం విధించలేదు గానీ, ప్రజల్లో అవగాహన పెరిగాక ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.