APSRTCలో వింత నిర్ణయం

apsrtc

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులు అవాక్కవుతున్నారు. కార్గో, కొరియర్ ప్రచార మాసోత్సవంలో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగి తన బంధువులూ, స్నేహితులతో నెలలో తప్పనిసరిగా మూడు పార్శిళ్లు బుక్ చేయించాలని ఆదేశించారు. ఆర్టీసీలో 50,145 మంది ఉద్యోగులు ఉండగా ప్రతి ఒక్కరూ మూడేసి చొప్పున బుకింగ్స్ చేస్తే.. 1.50లక్షలు అవుతాయని అధికారులు లెక్కలు వేశారు. దీనికోసం అధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేక కొంతమంది ఉద్యోగులు శుభాకాంక్షలు రాసి బంధువులకు పంపుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version