క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న 300 మంది వింత వ్యాధితో బాధపడుతున్నారు. టెక్సాస్ నుంచి మెక్సికోకు వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓడలో మొత్తం 2,881 మంది ప్రయాణికులు ఉండగా 284 మంది మిస్టరీ వ్యాధి బారిన పడ్డారు. 1,159 మంది సిబ్బందిలో 34 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వాంతులు, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ వ్యాధికి కారణాలు ఇంకా తెలియరాలేదు.