సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ కవ్వింపులతో దేశ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన బ్రహ్మోస్, అస్త్ర వంటి క్షిపణులను జోడించడం వల్ల భారత్ వద్ద ఉన్న సుఖోయ్-30 ఎంకేఐ విమానాలు మరింత శక్తివంతమయ్యాయి. ఈరకం యుద్ధ విమానాలు చైనా దగ్గర ఉన్నప్పటికీ వాటికన్నా మన జెట్‌లు అత్యుత్తమమైనవి. దాదాపు 15 దేశాల వద్ద ఇవి ఉన్నా.. భారత్ మాత్రమే ఈ లోహవిహాంగాలకు దాడి సామర్థ్యాన్ని కలిగించింది. భారత వైమానిక దళం వద్ద ఇలాంటివి 272 ఉన్నాయి.