ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా కేంద్రం ఆపరేషన్ గంగా చేపట్టి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే 634 మంది తెలంగాణ విద్యార్థులు క్షేమంగా వారి ఇళ్లకు చేరుకున్నారు. సోమవారం మరో 9 మంది తమ స్వగృహాలకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి విద్యార్థులను ముంబై, దిల్లీ విమానాశ్రయాలకు తరలించి. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు చేరవేస్తున్నామని వివరించారు.