AP: వైఎస్సార్ కడప జిల్లాలోని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు ఫీజుల సమస్య ఉండటంతో సమస్యను డిప్యూటీ సీఎం అంజాద్ పాషా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను అంజాద్ పాషా సీఎంకు వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం ఫీజుల కోసం నిధుల మంజూరుకు ఒకే చెప్పారు. 2015లో ఇబ్బందిపడిన 46 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఈ ఫీజుల కింద రూ.9.12 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో విద్యార్థులు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.