డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం గురించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉండనుందని తెలిసింది. ఈ సినిమా సెకండాఫ్లో బోస్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే సినిమాలో అత్యంత కీలకమని తెలిసింది. ఈ చిత్రంలో రామ్ చరోణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. ఓ క్యారెక్టర్ గ్రామీణ యువకుడిగా.. మరో పాత్రలో స్టైలిష్గా కనిపించనున్నాడు.