సుచిత్రా కృష్ణమూర్తి..తెలుగు కుటుంబానికి చెందిన హీరోయిన్. కానీ తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించి పేరు సంపాదించుకుంది. అయితే కొంతకాలు సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. ఇటీవల హిందీలో బూల్ బులాయియా 2 మూవీలో, గిల్టీ మైండ్స్ వెబ్‌సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 1999లో ఆమె శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వారికి కావేరి కపూర్ అనే కూతురు ఉంది. విడాకుల తర్వాత ఒంటరిగా ఉండటం చూడలేక కావేరి తన తల్లి పేరును డేటింగ్ సైట్‌లో చేర్చిందట. అందులో ఒక వ్యక్తితో పరిచయమై కొంతకాలం డేటింగ్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో సుచిత్రా తెలిపింది. కాని ఆ తర్వాత అతడితో కూడా విడిపోయిందట. ఇక అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తున్నాయని ఆ సైట్ నుంచి ప్రొఫైల్ డిలీట్ చేసినట్లు తెలిపింది.ఇక నాకు ఎవరితో డేటింగ్ అవసరం లేదని తన కూతురితో చెప్పేసిందట.