తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మల్లిఖార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి సమక్షంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకోవడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించే ప్రయత్నం చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. రేవంత్ తప్పు చేశారంటూ కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
-
wiki
-
twitter: komatireddy venkat reddy