శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదని భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. కాలిఫోర్నియా స్టేట్ కోర్టులో దావా వేశారు. 1355 మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ పెద్ద భవనంలో ట్విటర్ 4,60,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. దీనికి డిసెంబర్ నెలకుగాను 3.36 మిలియన్ డాలర్లు, జనవరి నెలకు 3.42 మిలియన్ డాలర్ల అద్దె చెల్లించాలి. ఇది సకాలంలో ఇవ్వకపోవటంతో యజమాని కోర్టుకెక్కారు.