TS: కూకట్ పల్లి పరిధిలోని కేపీహెచ్బీలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తాను నివాసముంటున్న అపార్టుమెంట్ 23వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు అర్పించుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్వాతి, శ్రీధర్ దంపతులకు అంగవైకల్యంతో కుమారుడు జన్మించాడు. అది తట్టుకోలేక మెర్సీ కిల్లింగ్కి పాల్పడుదామని స్వాతిని ఒప్పించేందుకు శ్రీధర్ ప్రయత్నించాడు. తీవ్రంగా వేధించాడు. దీంతో కుమారుడిని చంపుకోవడం ఇష్టంలేక తనే ఆత్మహత్య చేసుకుంది. అయితే, స్వాతి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా శ్రీధర్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం