కాపురంలో క‌ల‌హాలు.. 41 ఏళ్ల‌లో 60 కేసులు

© ANI Photo

భార్య‌భ‌ర్త‌లు క‌ల‌కాలం కాపురం చేసి, పిల్లా పాప‌ల‌తో సుఖంగా ఉండాల‌ని దీవించి పెద్ద‌లు పెళ్లి చేస్తారు. కానీ పెళ్లి చేసుకున్న జంట త‌మలోని అహంకారం, ఈర్ష్య‌ల‌తో కోర్టు మెట్లెక్కి విడాకుల వ‌ర‌కు తెచ్చుకొని సంసారాన్ని చెడ‌గొట్టుకుంటున్నారు. ఈ కోవ‌లోకే చెందుతుంది ఓ జంట. 30 ఏళ్లు కాపురం చేసి.. మనస్ఫర్థల కారణంగా విడిపోయి.. 41 ఏళ్లలో ఒకరిమీద ఒకరు 60 కేసులు పెట్టుకున్నారు. ఇక‌, 11ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్న ఆ దంపతుల‌పై సుప్రీంకోర్టు సీజేఐ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మస్యల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించ‌న ఆయ‌న.. ఇలాంటి వారు ఒక్క‌రోజైనా కోర్టు ముఖం చూడ‌కుండా నిద్ర‌పోలేరు అంటూ వ్యాఖ్యానించారు.

Exit mobile version