సన్నీలియోన్ తెలుగులో మంచు మనోజ్‌తో కలిసి ‘కరెంట్ తీగ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘గరుడ వేగ’ సినిమాలో ఒక ఐటెం సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం మంచు విష్ణు ’గాలి నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగులోకి మళ్లీ రీఎంట్రీకి సిద్ధమైంది సన్నీలియోన్. ఇందులో ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. సన్నీ రేణుక అనే ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించనుందట. ఆమె విదేశాల నుంచి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయనేదే సినిమా కథగా తెలుస్తుంది. సన్నీ లియోన్ షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం తిరుపతి వద్ద రంగంపేటలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది.