ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. నేడు ఆ టీజర్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. అక్టోబర్ 2వ తేదీన టీజర్ కూడా విడుదల కానుంది. దీంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఇప్పుడు టీజర్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది.