త్వరలో సూపర్‌స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని పద్మాలయ స్టూడియోస్ వద్ద ఈ మెమోరియల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మెమోరియల్‌లో కృష్ణ విగ్రహం, ఆయన జీవితానికి, సినిమాలకు సంబంధించిన పలు ఫొటోలు, షీల్డులను అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. కృష్ణకు సంబంధించిన పలు పదిలమైన జ్ణాపకాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు

Courtesy Twitter: suresh kondi