మధ్యప్రదేశ్: భోపాల్‌లో దారుణం జరిగింది. మూఢనమ్మకంతో సొంత తల్లిదండ్రులే తమ చిన్నారిని బలిగొన్నారు.. కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారినపడింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది.