మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 2016లో కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయగా.. దీనికి వ్యతిరేకంగా గతంలో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్రం నోట్ల రద్దుపై తీసుకున్న ఆదేశాలు, ఆర్బీఐ మార్గదర్శకాలను పరిశీలించిన న్యాయస్థానం, తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.