కోవిడ్ కారణంగా కుటుంబంలో ఒకరు మరణిస్తే వారి రక్తసంబంధీకులకు రూ.50వేల పరిహారం అందించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఇద్దరు మరణిస్తే లక్ష రూపాయలను అందజేయాలని నేడు తెలిపింది. కరోనాతో తల్లి, తండ్రి కోల్పోయిన పిల్లలకు లక్ష రూపాయలు అందించాలని సూచించింది. ఈరోజు అస్పాం నుంచి దాఖలైన ఓ పిటీషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే పరిహారం కోసం నకిలీ పత్రాలను సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కాగ్ దర్యాప్తుకు ఆదేశిస్తామని ధర్మాసనం పేర్కొంది.