సుప్రీం కోర్టు ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద ఊరటనిచ్చింది. గోద్రా అల్లర్ల కేసును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది. ఇప్పటికే సిట్ పీఎంకు క్లీన్ చిట్ ఇవ్వగా.. 2006లో కాంగ్రెస్ ఎంపీ భార్య మోదీ సహా 63 మందిపై సుప్రీంలో పిల్ వేసింది. ఈ పిల్ విచారించిన సుప్రీం దీనిని అర్హత లేనిది అంటూ కొట్టేసింది. దీంతో మోదీకి క్లీన్ చిట్ వచ్చింది. గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.