బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు

నటసింహం బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలయ్యతో పాటు ఇరు రాష్ట్రాల రెవెన్యూ ముఖ్య కార్యదర్శలు, వాణిజ్య పన్నుల కమిషనర్లు, ‘గుణ టీం వర్క్స్‌’, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు నోటీసులు అందాయి. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు సంబంధించి సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాయితీలు అందించాయి. అయితే ఆ రాయితీలను ప్రజలకు బదలాయించకుండా ప్రొడ్యూసర్లే జేబులో వేసుకున్నారని పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Exit mobile version