పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. 2016 నవంబర్ 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదే అని పేర్కొంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు వెలువరించింది.