లాక్ అప్ స్ట్రీమింగ్ ఆపలేమన్న సుప్రీంకోర్టు

© File Photo

కాపీరైట్ ఉల్లంఘన వివాదంపై Alt బాలాజీ రియాలిటీ షో నిర్మించిన “లాక్ అప్” స్ట్రీమింగ్ ఆపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాపీరైట్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ షో మేకర్స్‌పై ప్రైడ్ మీడియా పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియాల్లో ఈ లాకప్ సిరీస్‌ను ప్రదర్శించకుండా నిరోధించాలని కోరింది. దీంతో ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి గురువారం సుప్రీంకోర్టు నో చెప్పింది.THE JAIL స్టోరీ ఆధారంగా ఈ లాక్ అప్ తెరకెక్కించినట్లు ప్రైడ్ మీడియా ఆరోపించింది. మరోవైపు ఈ షో ఇప్పటికే ప్రసారం చేయబడుతున్నట్లు గుర్తు చేసింది.

Exit mobile version