సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గార్గి’ సినిమాను హీరో సూర్య, జ్యోతిక దంపతులు నిర్మిస్తున్నారు. కథ చాలా నచ్చడంతో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీన్ని తెరకెక్కిస్తున్నట్లు సూర్య సోషల్‌మీడియా ద్వారా తెలియజేశాడు. ఒక అమ్మాయి తన హక్కుల కోసం పోరాడే కథ ఇది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గౌతమ్ రామచంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.