రానున్న కాలంలో న్యూరాలింక్‌తోనే మనిషి మనుగడ సాధ్యమని టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ ‘చాట్‌జీపీటీ’ తాజాగా మరో పరీక్ష పాస్ కావడంపై ట్విటర్‌లో ఎలన్ మస్క్ స్పందించారు. ‘ఇక మనుషులు చేయడానికి ఏం మిగిలి ఉంది? న్యూరాలింక్‌ని అమర్చుకుంటేనే మనం పైచేయి సాధించగలం’ అని ట్వీట్ చేశారు. మనిషి మెదడుని చిప్‌తో అనుసంధానించే ‘న్యూరాలింక్’ ప్రాజెక్టును మస్క్ చేపట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను తలదన్నేలా ఇది పనిచేస్తుందని గతంలో వెల్లడించారు. ఇటీవల కోతిపై జరిపిన ప్రయోగం విజయవంతం అయింది.