శ్రీలంకతో రేపటి నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. దీపక్ చాహర్ ఆడడని కన్ఫామ్ అయిపోయినా కానీ సూర్య కుమార్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. వీరిద్దరూ బెంగుళూరులో ఉన్న NCAలో చేరనున్నట్లు తెలుస్తోంది. విండీస్‌తో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. చివరి టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటుగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.