బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పోస్ట్‌మార్టమ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది రూప్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సుశాంత్ డెడ్‌బాడీ ఫస్ట్ టైం చూసినప్పుడే అది సూసైడ్ కాదని, హత్యేనని నాకు అర్థమైంది. పోస్ట్‌మార్టం సమయంలో వీడియో తీయాల్సింది కానీ అధికారులు ఫొటోలు మాత్రమే తీయాలని ఆదేశించారు. రాత్రికి రాత్రే పోస్ట్‌మార్టం పూర్తి చేశాం’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రూప్ కుమార్ వ్యాఖ్యలు నెట్టింట్లో చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో #SushantSinghRajput హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.