రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రావణసుర చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో యంగ్ హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి సుశాంత్ ఒక అప్డేట్ ఇచ్చారు. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతేగాక డబ్బింగ్‌కు సంబంధించిన ఫోటోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.మరోవైపు రావణాసుర ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు.