టెక్ దిగ్గజం గూగుల్.. రష్యాలోని తమ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్లే స్టోర్ కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఫిబ్రవరి చివరి వారంలో గూగుల్ తన సేవలను రష్యాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా గూగుల్ ప్లే కొనుగోళ్లను సైతం నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న అమానుష దాడికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తుండగా.. పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి.