సూపర్ స్టార్ మహేష్ బాబు, పరుశురాం కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. మే 12న విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం అమెరికాలో అత్యధిక లొకేషన్స్‌లో విడుదల కానుంది. సుమారు 603 పైగా లొకేషన్స్‌లో మూవీని విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది.