సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన రీసెంట్ మూవీ సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా యూఎస్ మార్కెట్లో సంచలనాలు క్రియేట్ చేస్తుందని మహేశ్ అభిమానులతో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా గాఢంగా నమ్ముతున్నారు. కావున ఈ సినిమాను యూఎస్ లో రికార్డు స్థాయి లొకేషన్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పుడు యూఎస్ లో 1 మిలియన్ డాలర్లను వసూలు చేయడం పరిపాటిగా మారింది. కానీ కొన్ని రోజుల క్రితం 1 మిలియన్ మార్క్ అంటే మాత్రం చాలా పెద్ద విషయం. కానీ మహేశ్ ఈ మార్కును ఈజీగా క్రాస్ చేసి చూపించాడు. ఇక ఇప్పుడు రిలీజవుతున్న సర్కారు వారి పాట యూఎస్ లో ఎన్ని డాలర్లను వసూలు చేస్తుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.