ఫుడ్ డెలివరీ బాయ్ కుక్కకు భయపడి మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. మహ్మద్ రిజ్వాన్ (23) స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు బంజారాహిల్స్‌లోని రాక్ క్యాసిల్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులోకి వెళ్లాడు. తలుపు తట్టగానే జర్మన్ షెఫర్డ్ కుక్క మొరుగుతూ రావడంతో రిజ్వాన్ అక్కడి నుంచి కిందకు దూకేశాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.