హైదరాబాద్ బంజారాహిల్స్లో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన బాయ్ పెంపుడు కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. స్విగ్గీలో పనిచేస్తున్న రిజ్వాన్ అనే వ్యక్తి బంజారాహిల్స్ లుంబినీ రాక్ అపార్ట్మెంట్లో డెలివరీకి వెళ్లాడు. అక్కడ మొదటి అంతస్థులో ఉన్న జర్మన్ షెఫర్డ్ను తప్పించుకునే క్రమంలో మొదటి అంతస్తు నుంచి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో… నాలుగు రోజులుగా ఆసుపత్రిలో కోమాలో ఉండి…ప్రాణాలు కోల్పోయాడు.