హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తుంది. గతకొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గణనీయంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 245 కేసులు నమోదుకాగా.. అందులో 240 కేసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే సీజనల్ జ్వరాలు, డెంగీ, మలేరియాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పుడు స్వైన్ ఫ్లూ తీవ్రత ప్రజలను కలవర పెడుతోంది.
చాపకింద నీరులా విస్తరిస్తున్న స్వైన్ఫ్లూ

© Envato