కొవిడ్-19పై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సరికొత్త అధ్యయనాన్ని బయటపెట్టింది. కరోనా వల్ల మెదడు కుంచించుకుపోయి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, వాసన గుర్తించే ప్రాంతాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఆసుపత్రిలో చేరకుండా ఇంటివద్దే కరోనా నయమైన వ్యక్తులలో ఈ ప్రభావం కనిపిస్తోందని అధ్యయనం తెలిపింది. అయితే, ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతుందా లేదా అనేది మరో అధ్యయనం ద్వారా తెలుస్తుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేర్కొంది. 51-81 వయస్సు గల 785 మందిలో వారి మెదడులను రెండు సార్లు స్కాన్ చేసి ఈ మార్పులను కనుగొన్నారు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు.